Kohli Records in IPL : ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ప్లేయర్‌గా కోహ్లీ

Update: 2024-05-23 05:30 GMT

ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీ 8 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. పరుగుల పరంగా కోహ్లీ దరిదాపుల్లో ఏ ప్లేయర్ లేకపోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో శిఖర్ ధవన్(6,769) ఉన్నారు. మరోవైపు ఈ సీజన్‌లో లీడింగ్ స్కోరర్‌గా కోహ్లీ ఉన్నారు.

మరోవైపు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకునే ఛాన్స్ ఉండేదన్నారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్ద ఉపయోగపడలేదని చెప్పారు. పాయింట్ల పట్టికలలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమేటర్ మ్యాచ్‌ వరకు రావడం గర్వంగా ఉందన్నారు. కాగా ఆర్సీబీ విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని రాజస్థాన్‌19 ఓవర్లలోనే చేధించింది.

మరోవైపు లీగ్ స్టేజీలో వరుసగా 6 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ.. కీలక పోరులో నిరాశపరిచింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. తొలుత ఆర్సీబీ 172/8 రన్స్ చేయగా.. RR 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన శాంసన్ సేన.. 24న SRHతో తలపడనుంది. అందులో గెలిచిన జట్టు 26న ఫైనల్‌లో KKRతో అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:    

Similar News