Lakshya Sen : కామన్‌వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత్ హవా..
Lakshya Sen : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది.;
Common Wealth Games : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పసిడి పతకం కొట్టేస్తే.. తాజాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం సాధించాడు.
ఫైనల్స్‌లో లక్ష్యసేన్ అద్భుతంగా ఆడి మలేషియాకు చెందిన జియాంగ్‌పై 19-21, 21-9, 21-16 తేడాతో ఘనవిజయం సాధించాడు. దాంతో ఒకేరోజు బ్యాడ్మింటన్స్‌లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది భారత్. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 స్వర్ణాలు వచ్చి చేరాయి.