ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ కు పతకం..
మహ్మద్ హుసాముద్దీన్ తన తొమ్మిది నెలల కుమార్తె హనియా ఫిర్దౌస్ కోసం బంగారు పతకం సాధించాలనుకున్నాడు.;
మహ్మద్ హుసాముద్దీన్ తన తొమ్మిది నెలల కుమార్తె హనియా ఫిర్దౌస్ కోసం బంగారు పతకం సాధించాలనుకున్నాడు. కానీ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.“కాంస్య పతకంతో ముగించడం దురదృష్టకరం. నేను ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుస్తానని చాలా నమ్మకంతో ఉన్నాను. కానీ క్వార్టర్ ఫైనల్
చివరి ఐదు సెకన్లలో నా ఎడమ కాలికి నొప్పి పట్టింది. దాంతో సరిగా ఆడలేకపోయాను. అయినప్పటికీ, ప్రపంచ ఛాంపియన్‌షిప్ వంటి పెద్ద ఈవెంట్‌లో పతకం సాధించడం నాకు సంతోషంగా ఉంది. నాకు సపోర్టుగా నిలిచిన నా కుటుంబానికి ఈ పతకాన్ని అంకితమిస్తున్నాను'' అని హుసాముద్దీన్ అన్నారు .
క్వార్టర్‌ఫైనల్ ముగిసిన వెంటనే తాను మంచి అనుభూతిని పొందానని హుసాముద్దీన్ చెప్పాడు. మరికొద్ది నెలల్లో ఆసియా క్రీడలు ఉన్నందున నేను వైదొలగాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ ఛాంపియన్‌షిప్ కోసం నేను చాలా కష్టపడ్డాను.
రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతకం సాధించిన హుసాముద్దీన్ గేమ్ గురించి మాట్లాడుతూ.. "నేను మొదటి రెండు రౌండ్లలో ముందంజలో ఉన్నాను. కాని తరువాత బల్గేరియన్ బాక్సర్ మరింత బలంగా దూసుకు వచ్చాడు. అతడి దాడిని ఎదుర్కోలేకపోయాను. రిజల్ట్ వెలువడినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను’’ అని అన్నారు.
తండ్రి సంసముద్దీన్ వద్ద బాక్సింగ్ నేర్చుకున్న హుసాముద్దీన్.. తన కూతురు హనియా ఫిర్దౌస్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని వెల్లడించాడు. బాక్సర్ల కుటుంబం నుండి వచ్చిన హుసాముద్దీన్ తన తండ్రి నుండి నేర్చుకున్న ప్రాథమిక అంశాలు మంచి బాక్సర్‌గా ఎదగడానికి దోహదపడ్డాయని చెప్పాడు. "నా తండ్రి కఠినమైన క్రమశిక్షణాపరుడు, అతనికి ధన్యవాదాలు.
ఆయన శిక్షణ ద్వారానే నేను అగ్రస్థానానికి చేరుకోగలిగాను అని తండ్రి పట్ల తన విధేయతను వ్యక్తం చేశాడు. ఈ చిన్న పట్టణంలో, మా తండ్రి వద్ద శిక్షణ పొందిన నిఖత్ వంటి అనేక మంది యువ బాక్సర్లు ఉన్నారు,'' అని హుస్సాముద్దీన్ చెప్పారు. "నేను ఆసియా క్రీడల్లో నా కుమార్తె కోసం బంగారు పతకం సాధించాలనుకుంటున్నాను అని హుసాముద్దీన్ వివరించారు.