RO-KO: రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్‌ కప్ ఆడతారా?

రవిశాస్త్రీ కీలక వ్యాఖ్యలు

Update: 2025-10-14 05:30 GMT

భారత స్టా­ర్ ఆట­గా­ళ్లు రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లీ.. ప్ర­స్తు­తం వన్డే­ల్లో­నే కొ­న­సా­గు­తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. 2027 వన్డే ప్ర­పంచ కప్ టా­ర్గె­ట్‌­గా ఈ ఒక్క ఫా­ర్మా­ట్లో­నే ఉం­టు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. అయి­తే.. మరో రెం­డే­ళ్లు వీరు ఫి­ట్‌­గా ఉం­డ­టం కష్ట­మే­న­ని.. ఫామ్ కో­ల్పో­వ­చ్చ­ని.. వర­ల్డ్ కప్‌ టీం­లో చోటు కష్ట­మే­న­ని ఎన్నో వా­ర్త­లు వస్తు­న్నా­యి. దీ­ని­పై టీ­మిం­డి­యా మాజీ కోచ్ రవి­శా­స్త్రి స్పం­దిం­చా­డు. ఆస్ట్రే­లి­యా సి­రీ­స్‌ అనం­త­రం భారత స్టా­ర్‌ క్రి­కె­ట­ర్లు రో­హి­త్‌ శర్మ, వి­రా­ట్‌ కో­హ్లీ­లు భవి­త­వ్యం­పై ని­ర్ణ­యం తీ­సు­కు­నే అవ­కా­శ­ముం­ద­ని మాజీ క్రి­కె­ట­ర్‌ రవి­శా­స్త్రి అభి­ప్రా­య­ప­డ్డా­డు. ‘‘ప్ర­పం­చ­క­ప్‌ ప్ర­ణా­ళి­క­ల్లో ఉన్నం­దు­కే రో­హి­త్, కో­హ్లి ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­కు వె­ళ్తు­న్నా­రు. అయి­తే ఫామ్, ఫి­ట్‌­నె­స్‌­పై­నే రెం­డే­ళ్ల తర్వాత జరి­గే మెగా టో­ర్నీ­లో వారి స్థా­నా­లు ఖా­య­మ­వు­తా­యి. భవి­త­వ్యం­పై ని­ర్ణ­యం తీ­సు­కు­నే ది­శ­గా ఆస్ట్రే­లి­యా­తో సి­రీ­స్‌ వా­రి­ద్ద­రి­కి కీ­ల­కం. ఆ సి­రీ­స్‌ ఆఖ­రి­కి వారు కె­రీ­ర్‌­పై ఓ ని­ర్ణ­యా­ని­కి రా­వొ­చ్చు. కు­ర్రా­ళ్ల నుం­చి పోటీ పె­రు­గు­తోం­ద­ని స్టా­ర్‌ క్రి­కె­ట­ర్లు ఇద్ద­రి­కీ తె­లు­సు. జట్టు ప్ర­ణా­ళి­క­ల్లో ఉం­డా­లం­టే ఏం చే­యా­లో వా­రి­కి ప్ర­త్యే­కం­గా చె­ప్పా­ల్సిన పని­లే­దు’’ అని రవి­శా­స్త్రి చె­ప్పా­డు. అను­భ­వ­జ్ఞు­లు ఎంత రా­ణిం­చి­న­ప్ప­టి­కీ.. పె­ద్ద మ్యా­చ్‌­ల్లో ఆడి­న­ప్ప­టి­కీ.. యు­వ­కుల నుం­చి గట్టి పోటీ నె­ల­కొం­ద­ని అన్నా­రు రవి­శా­స్త్రి. ఇటీ­వ­లి కా­లం­లో శు­భ్‌­మ­న్ గిల్, యశ­స్వీ జై­స్వా­ల్, తి­ల­క్ వర్మ వంటి మంచి యువ ఆట­గా­ళ్లు భా­ర­త్ తర­ఫున అద్భు­తం­గా ఆడు­తు­న్నా­ర­ని.. ఇక్కడ ము­ఖ్యం­గా ఇటీ­వల ఆసి­యా కప్‌ ఫై­న­ల్‌­లో తి­ల­క్ వర్మ పా­కి­స్థా­న్‌­పై ఆడిన ఇన్నిం­గ్స్‌­ను ప్ర­స్తా­విం­చా­రు. ఈ సం­వ­త్స­రం ఫి­బ్ర­వ­రి­లో జరి­గిన ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ ఫై­న­ల్లో చి­వ­రి­సా­రి రో­హి­త్, కో­హ్లీ.. భా­ర­త్‌­కు ప్రా­తి­ని­థ్యం వహిం­చ­గా.. ఇప్పు­డు ఆస్ట్రే­లి­యా­తో వన్డే సి­రీ­స్ ఆడ­ను­న్నా­రు.


 ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

టీ­మిం­డి­యా స్టా­ర్ క్రి­కె­ట­ర్లు రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లీ­ని గ్రౌం­డ్ లో ఎప్పు­డె­ప్పు­డు చూ­స్తా­మా అని అభి­మా­ను­లు వేయి కళ్ళ­తో ఎదు­రు చూ­స్తు­న్నా­రు. ప్ర­పంచ క్రి­కె­ట్ లో వీరు సం­పా­దిం­చు­కు­న్న ఫా­లో­యిం­గ్ అలాం­టి­ది. ఏ ఏడా­ది ప్రా­రం­భం­లో ఈ ద్వ­యం ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ ఫై­న­ల్ ఆడిన తర్వాత అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ లో కని­పిం­చ­లే­దు. టీ20, టె­స్ట్ కె­రీ­ర్ కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చిన ఈ ది­గ్గజ క్రి­కె­ట­ర్లు కే­వ­లం వన్డే­ల్లో మా­త్ర­మే కొ­న­సా­గు­తు­న్నా­రు. గత ఏడా­ది టీ20 వర­ల్డ్ కప్ గె­లి­చాక ఇద్ద­రూ పొ­ట్టి ఫా­ర్మా­ట్ కు గుడ్ బై చె­ప్ప­గా.. ఆ తర్వాత టె­స్ట్ ఫా­ర్మా­ట్ కు వీ­డ్కో­లు తె­లి­పి షాక్ కు గురి చే­శా­రు. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ తర్వాత టీ­మిం­డి­యా వన్డే­లు ఆడ­లే­దు. ఈ మెగా టో­ర్నీ తర్వాత ఐపీ­ఎ­ల్.. ఇం­గ్లాం­డ్ తో ఐదు మ్యా­చ్ ల టె­స్ట్ సి­రీ­స్..ఆసి­యా కప్ తో ఆడు­తూ భారత జట్టు బి­జీ­గా మా­రిం­ది. దా­దా­పు 7 నె­ల­లు తర్వాత రో­హి­త్-కో­హ్లీ­ని గ్రౌం­డ్ లో చూ­డ­డా­ని­కి అభి­మా­ను­లు ఆస­క్తి­గా ఉన్నా­రు. అక్టో­బ­ర్ 19 నుం­చి ఆస్ట్రే­లి­యా­తో టీ­మిం­డి­యా మూడు మ్యా­చ్ ల వన్డే సి­రీ­స్ ఆడ­నుం­ది. ఈ మెగా సి­రీ­స్ కు వారం రో­జుల సమ­య­మే ఉంది. అక్టో­బ­ర్ 15న భారత క్రి­కె­ట్ జట్టు ఆస్ట్రే­లి­యా బయ­లు­దే­ర­నుం­ది. తొలి వన్డే ఆది­వా­రం (అక్టో­బ­ర్ 19) పె­ర్త్ లో జర­గ­నుం­ది. ఈ మ్యా­చ్ లో కో­హ్లీ, రో­హి­త్ బరి­లో­కి ది­గు­తా­ర­ను­కుం­టే ఫ్యా­న్స్ కు బిగ్ షాక్ తగ­ల­నుం­ది. వా­తా­వ­రణ రి­పో­ర్ట్స్ ప్ర­కా­రం తొలి వన్డే­కు వర్షం ము­ప్పు పొం­చి ఉంది.

Tags:    

Similar News