Neeraj- Manu: నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మను తల్లి

ఏం మాట్లాడుకున్నారబ్బా ?, పెళ్ళి మాటలే అంటున్న నెటిజన్లు;

Update: 2024-08-12 08:00 GMT

 2024 పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మను బాకర్‌లకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో మను, నీరజ్ చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం.. ఇద్దరిని ఫోటో తీస్తున్న తల్లి సుమేధను మను వద్దని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన మను తల్లి సుమేధ.. బల్లెం వీరుడితో తలపై ఒట్టు వేయించుకోవడం ఇక్కడ కొసమెరుపు.

వీడియోలు చూసిన నెటిజెన్ల మదిలో నీరజ్ చోప్రా, మను బాకర్‌లు మంచి స్నేహితులా? లేదా రిలేషన్‌లో ఉన్నారా? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. కొందరు అయితే మను, నీరజ్ పెళ్లి ఎప్పుడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూతురిని పెళ్లి చేసుకోవాలని నీరజ్‌ను సమేధ కోరినట్లు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా నీరజ్‌తో మను తల్లి సుమేధ ఏం మాట్లాడారు?, ఎందుకు ఒట్టు వేయించుకున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నీరజ్, మనుల పేర్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన తొలి భారత షూటర్‌గా మను బాకర్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం, మిక్స్‌డ్ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్‌ సృష్టించింది. 25 మీటర్‌ల విభాగంలో మూడో పతకం తృటిలో చేజారింది. జావెలిన్‌ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

Tags:    

Similar News