Pakistan Cricket Coach : పాకిస్థాన్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ రాజీనామా
పాక్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ రాజీనామా చేశారు. కొద్దిగంటల్లో పాక్ జట్టు సౌతాఫ్రికాకు టెస్ట్ సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండగా ఆయన పాక్ క్రికెట్ బోర్డ్ కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. ‘గిలెస్పీ రాజీనామా చేశారు’ అని పీసీబీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని వివరించింది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్‌నే టెస్టు జట్టుకూ తాత్కాలికంగా పీసీబీ నియమించింది.
కాగా, అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడానికి పీసీబీ నిరాకరించడంతోనే గిలెస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గిలెస్పీ, నీల్సన్ ఇద్దరూ మంచి అవగాహనతో జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఇక గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా తర్వాత ఆకిబ్ జావేద్ ఇంతకుముందు వైట్ బాల్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు, మూడు వన్డేల కోసం పాక్ వైట్ బాల్ జట్టుతో ఉన్నాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో భాగంగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.