ఆసియా కప్ ఫైనల్ అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు-PCB తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ACC అధ్యక్షుడు, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ప్రపంచం దుమ్మెత్తిపోస్తోంది. అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత్ జట్టు నిరాకరించినందుకు నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్ కు తీసుకెళ్లడం తీవ్ర దూమారం రేపింది. నఖ్వీ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ..... ఆయనపై ICCకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది.