ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి ఆసియా కప్‌పైనే ఉంది. ఈ మెగా టోర్నమెంట్లో భారత జట్టు ఎలా ఉండనుందనే చర్చ జరుగుతోంది. సారధిగా ఎవర్ని నియమిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా యంగ్ ప్లేయర్లు అంతా సిద్ధమవుతున్నారు. 2027 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ అలాగే కోహ్లీని సెలెక్ట్ చేయకూడదని ఇప్పటికే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని కూడా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ టి20 జట్టును లీడ్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్ ఇస్తారని తాజాగా నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఈ మేరకు గౌతమ్ గంభీర్ సూచనలు చేశారట. రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని పేర్కొన్నారట. ఒకవేళ పంత్ కు కెప్టెన్సీ చాన్స్ ఇస్తే.. వన్డే లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే ప్రమాదం కూడా ఉంటుంది
మీకు సిగ్గుండాలి: భారత్ కోచ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అండగా నిలిచాడు. అతన్ని విమర్శించేందుకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ లేకున్నా.. జట్టు కోసం బరిలోకి దిగిన బుమ్రాను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన బుమ్రాను కొనియాడిన జనాలు ఇప్పుడు తిట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడనే విషయాన్ని మరవద్దన్ని గుర్తు చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో బుమ్రా.. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. ఈ మూడింటిలో టీమిండియా రెండు ఓడింది. మరొకటి డ్రా చేసుకుంది. తాను ఆడని రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐదు టెస్ట్‌లకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 23 వికెట్లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన బుమ్రాను ఇలా విమర్శించడ సరికాదని అన్నాడు. బుమ్రా భారత్‌కు లభించిన వజ్రమన్నాడు.