పర్యావరణహితంగా, అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా 131 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా గ్రామాన్ని నిర్మించారు. గ్రామనిర్మాణానికి కొందరు అథ్లెట్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. 82 భవనాల్లో 3వేల ప్లాట్లు.. 7200 గదులు ఉన్నాయి. సీన్ నది ఒడ్డుపై మూడు నగరాల్లో ఈ క్రీడా గ్రామం విస్తరించింది వుంది. ఒలింపిక్స్ లో 14500 మందికి, పారా ఒలింపిక్స్ లో 9 వేల మందికి ఇక్కడ వసతి కల్పిస్తారు.
ఈ గ్రామం నిర్మాణానికి రూ.15,490 కోట్లు వెచ్చించారు. అథ్లెట్ల శిక్షణ నుంచి జిమ్, సేదతీరడం వరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన భోజనశాలలో ఒకేసారి 3500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. భారతీయ అథ్లెట్ల కోసం ప్రత్యేక మెనూ సిద్ధంచేశారు. రోజుకు సగటున 40వేల మందికి భోజన వసతి కల్పిస్తారు. ఒలింపిక్స్ ముగిశాక క్రీడా గ్రామం స్వరూపం మారిపోతుంది.
2800 ఇళ్లు, హోటళ్లు, పార్కులు, కార్యాలయాలు, దుకాణాలతో పూర్తి నివాస ప్రాంతంగా రూపుదాల్చనుంది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్ లను సిద్ధం చేసి ఉంచారు.