'ఈరోజు నాది కాకుండా పోయింది' .. ఓటమిపై పీవీ సింధు..!
టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌తో తలపడిన సింధు ఆమె చేతిలో ఓటమి పాలైంది. తొలిసెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివర్లో తైజు పుంజుకుంది.;
సెమీ ఫైనల్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని అన్నారు భారత షట్లర్ పీవీ సింధు. చివరి వరకు గెలిచేందుకే పోరాడాను కానీ ఈరోజు నాది కాకుండా పోయిందని ఆమె విచారణ వ్యక్తం చేశారు. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌తో తలపడిన సింధు ఆమె చేతిలో ఓటమి పాలైంది. తొలిసెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివర్లో తైజు పుంజుకుంది.
ఇక రెండో సెట్‌లో మాత్రం సింధు పైన తైజుయింగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీనితో సింధుకి ఓటమి తప్పలేదు. అయితే ఓటమి పైన ఆమె మాట్లాడుతూ.. ''తన బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తను నాపై పైచేయి సాధించింది. సెమీస్‌లో పాయింట్లు సాధించడం అంత తేలికేమీ కాదు. కాకపోతే విజయం చేజారింది'' అని ఆమె పేర్కొంది.
అయితే టోక్యో ఒలింపిక్స్‌లో తన పోరాటం ఇంకా ముగియలేదని, కాంస్య పతకం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు(ఆదివారం) జరిగే మ్యాచ్‌లో పతకం సాధించేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని ఆమె వెల్లడించింది. మరో సెమీస్‌లో ఓటమిపాలైన హి బింగ్జియావో క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది.