Cricket : రోహిత్ నిర్ణయం స‌రైన‌దే : ట్రావిస్ హెడ్

Update: 2024-11-19 14:15 GMT

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ ప్రారంభానికి సమయం అసన్నమైంది. మరో రెండు రోజుల్లో భారత్‌-ఆసీస్ మధ్య ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీకి తెరలేవనుంది. ఈ బీజీటీ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.రోహిత్ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ జ‌ట్టుతో పాటు ఆస్టేలియాకు వెళ్లకుండా భార‌త్‌లోనే ఉండిపోయాడు. అయితే మ‌రి కొన్ని రోజుల పాటు భార్యతో పాటే ఉండాల‌ని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో రోహిత్ నిర్ణయాన్ని కొంతమంది త‌ప్పు బ‌ట్టారు. ముందుగానే త‌న భార్య బిడ్డకు జ‌న్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టులో ఆడింటే బాగుండేద‌ని అభిప్రాయప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మాత్రం రోహిత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ తీసుకున్న నిర్ణయం స‌రైన‌దేన‌ని హెడ్ తెలిపాడు."రోహిత్ శ‌ర్మ తీసుకున్న నిర్ణయం వంద శాతం స‌రైన‌దే. అత‌డికి నేను పూర్తి మ‌ద్దతు ఇస్తున్నాను. అదే పరిస్థితిలో నేను ఉన్నా రోహిత్‌లానే ఆలోచిస్తాను. క్రికెటర్లగా మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాము. వృత్తిని, ఫ్యామిలీని రెండూ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లు కూడా కోల్పోవాల్సి వస్తుంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News