ROHIT: రోహిత్ కెప్టెన్సీ పోవడం వెనుక భారీ కుట్ర.. !

అసలు గుట్టు విప్పిన మాజీ క్రికెటర్..సంచలన వ్యాఖ్యలు చేసి మనోజ్ తివారీ...గంభీర్ వల్లే కెప్టెన్సీ తీసేశారని వ్యాఖ్య

Update: 2026-01-17 04:30 GMT

భారత క్రి­కె­ట్‌­లో కె­ప్టె­న్సీ అంశం ఎప్పు­డూ సు­న్ని­త­మై­న­దే. వి­జ­యం వచ్చి­న­ప్పు­డు ప్ర­శం­స­లు వె­ల్లు­వె­త్తు­తా­యి… అదే సమ­యం­లో అనూ­హ్య­మైన మా­ర్పు­లు చోటు చే­సు­కుం­టే వి­మ­ర్శ­లు తీ­వ్రం­గా వి­ని­పి­స్తా­యి. తా­జా­గా అలాం­టి వి­వా­దా­ని­కే తె­ర­లే­చిం­ది. ఐసీ­సీ ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ­ని భా­ర­త్‌­కు అం­దిం­చిన కె­ప్టె­న్ అయిన రో­హి­త్ శర్మ­ను వన్డే కె­ప్టె­న్సీ నుం­చి తొ­ల­గిం­చిన ని­ర్ణ­యం దే­శ­వ్యా­ప్తం­గా పె­ద్ద చర్చ­కు దా­రి­తీ­సిం­ది. ఈ మా­ర్పు వె­నుక అసలు కా­ర­ణా­లేం­టి? ఇది కే­వ­లం భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­లో భా­గ­మా, లేక తెర వె­నుక మరే­దై­నా ప్ర­భా­వం పని­చే­సిం­దా అనే ప్ర­శ్న­లు ఇప్పు­డు క్రి­కె­ట్ అభి­మా­ను­ల­ను వెం­టా­డు­తు­న్నా­యి. ఈ ని­ర్ణ­యా­న్ని అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చిన వ్య­క్తి భారత చీఫ్ సె­లె­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్. అయి­తే ఈ కఠిన ని­ర్ణ­యా­ని­కి ఆయన ఒక్క­డే కా­ర­ణ­మా అనే సం­దే­హా­లు వెం­ట­నే తె­ర­పై­కి వచ్చా­యి. ము­ఖ్యం­గా భారత జట్టు హెడ్ కోచ్ అయిన గౌ­త­మ్ గం­భీ­ర్ పా­త్ర­పై అను­మా­నా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో మాజీ క్రి­కె­ట­ర్ మనో­జ్ తి­వా­రీ చే­సిన వ్యా­ఖ్య­లు ఇప్పు­డు సం­చ­ల­నం­గా మా­రా­యి.

మనో­జ్ తి­వా­రీ ఈ వ్య­వ­హా­రం­పై తీ­వ్ర స్థా­యి­లో స్పం­దిం­చా­రు. అజి­త్ అగా­ర్క­ర్ ఒక బల­మైన వ్య­క్తి­త్వం ఉన్న సె­లె­క్ట­ర్ అని ఒప్పు­కుం­టూ­నే, ఇలాం­టి పె­ద్ద ని­ర్ణ­యా­లు కోచ్ ఇన్‌­పు­ట్ లే­కుం­డా జర­గ­వ­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. “చీఫ్ సె­లె­క్ట­ర్ ని­ర్ణ­యం ప్ర­క­టిం­చి­నా, కోచ్ అభి­ప్రా­యం తప్ప­కుం­డా ఇం­దు­లో భా­గం­గా ఉం­టుం­ది. ఒకరి భు­జం­పై తు­పా­కీ పె­ట్టి మరొ­క­రు కా­ల్చి­న­ట్లు­గా ఈ వ్య­వ­హా­రం కని­పి­స్తోం­ది” అని ఆయన ఘాటు వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఈ వ్యా­ఖ్య­లు క్రి­కె­ట్ వర్గా­ల్లో చర్చ­ను మరింత వే­డె­క్కిం­చా­యి. ము­ఖ్యం­గా రో­హి­త్ శర్మ నా­య­క­త్వా­న్ని తీ­సు­కుం­టే, అతని రి­కా­ర్డు ఏ మా­త్రం తక్కువ కాదు.

టీ20 ప్ర­పం­చ­క­ప్, ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ వంటి కీలక టో­ర్నీ­ల్లో భారత జట్టు­ను వి­జ­య­ప­థం­లో నడి­పిం­చిన కె­ప్టె­న్‌­ను వన్డే ఫా­ర్మా­ట్ నుం­చి తప్పిం­చ­డం వె­నుక క్రి­కె­ట్ లా­జి­క్ ఏం­ట­న్న ప్ర­శ్న­కు స్ప­ష్ట­మైన సమా­ధా­నం లే­ద­ని మనో­జ్ తి­వా­రీ అభి­ప్రా­య­ప­డ్డా­రు. “వి­జ­యా­లు సా­ధిం­చిన కె­ప్టె­న్‌­ను ఇలా పక్కన పె­ట్ట­డం అర్థం కా­వ­డం లేదు. ఇది పూ­ర్తి­గా అస­హ­జ­మైన ని­ర్ణ­యం” అని ఆయన అన్నా­రు. ఈ మా­ర్పు­కు ప్ర­ధాన కా­ర­ణం­గా సె­లె­క్ష­న్ కమి­టీ 2027 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­ను చూ­పు­తోం­ది. ఆ లక్ష్యా­న్ని దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని యువ ఆట­గా­డు శు­భ్‌­మ­న్ గి­ల్ను కొ­త్త వన్డే కె­ప్టె­న్‌­గా ని­య­మిం­చా­రు. రో­హి­త్ శర్మ వయ­స్సు ప్ర­స్తు­తం 38 ఏళ్లు కా­వ­డం, అతను 2027 ప్ర­పం­చ­క­ప్ సమ­యా­ని­కి జట్టు­లో ఉం­టా­డో లేదో అన్న అని­శ్చి­తి కా­ర­ణం­గా ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు సమా­చా­రం. సె­లె­క్ష­న్ కమి­టీ­నే రో­హి­త్ని తప్పిం­చి­న­ట్టు తె­లు­స్తోం­ది. దీ­ని­పై మనో­జ్ తి­వా­రీ మరింత భా­వో­ద్వే­గం­గా స్పం­దిం­చా­రు. “మూడు డబు­ల్ సెం­చ­రీ­లు సా­ధిం­చిన, జట్టు కోసం ఎప్పు­డూ ని­స్వా­ర్థం­గా ఆడే ఆట­గా­డి సా­మ­ర్థ్యా­న్ని శం­కిం­చ­డం తప్పు. ఇలాం­టి ని­ర్ణ­యం నాకు వ్య­క్తి­గ­తం­గా చాలా బాధ కలి­గిం­చిం­ది” అని ఆయన అన్నా­రు. మే­నే­జ్‌­మెం­ట్‌­లో స్ప­ష్టత లే­క­పో­వ­డం వల్ల తా­ని­క్క­డి­నుం­చి వన్డే క్రి­కె­ట్ చూ­డా­ల­నే ఆస­క్తి కూడా కొంత తగ్గి­పో­యిం­ద­ని ఆయన ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. భారత క్రి­కె­ట్ చరి­త్ర­లో రో­హి­త్ శర్మ అత్యంత వి­జ­య­వం­త­మైన కె­ప్టె­న్ల­లో ఒక­డి­గా గు­ర్తిం­పు పొం­దా­డు. అతని నా­య­క­త్వం­లో జట్టు ఎన్నో కీలక వి­జ­యా­లు సా­ధిం­చిం­ది. అలాం­టి కె­ప్టె­న్‌­ను అక­స్మా­త్తు­గా పక్కన పె­ట్ట­డం ఇప్పు­డు గం­భీ­ర్ – అగా­ర్క­ర్ ద్వ­యం­పై వి­మ­ర్శ­ల­కు దా­రి­తీ­స్తోం­ది. మొ­త్తం­గా మళ్లీ క్రి­కె­ట్ లో కె­ప్టె­న్ రచ్చ మొ­ద­లైం­ది.

Tags:    

Similar News