ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే బెంగళూరు కల మరోసారి కల్లలయ్యింది. నిన్న రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమితో టోర్నీ ప్లేఆఫ్స్‌లో అత్యధికసార్లు(16 మ్యాచ్‌లలో 10 సార్లు) వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (26M.. 9 ఓటములు), ఢిల్లీ (11M.. 9 పరాజయాలు), ముంబై (20M.. 7 ఓటములు), సన్ రైజర్స్ (12M.. 7 పరాజయాలు) ఉన్నాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని విషయం తెలిసిందే.
మరోవైపు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉండేదన్నారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్ద ఉపయోగపడలేదని చెప్పారు. పాయింట్ల పట్టికలలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమేటర్ మ్యాచ్ వరకు రావడం గర్వంగా ఉందన్నారు. కాగా ఆర్సీబీ విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని రాజస్థాన్19 ఓవర్లలోనే చేధించింది.