sania: టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా పెళ్లి!

సా­ని­యా మీ­ర్జా మరో­సా­రి పె­ళ్లి పీ­ట­లు ఎక్క­బో­తు­న్న­ట్లు వా­ర్త­లు;

Update: 2025-07-17 06:30 GMT

టె­న్ని­స్ క్వీ­న్ సా­ని­యా మీ­ర్జా మరో­సా­రి పె­ళ్లి పీ­ట­లు ఎక్క­బో­తు­న్న­ట్లు వా­ర్త­లు వస్తు­న్నా­యి. పా­కి­స్తా­న్ క్రి­కె­ట­ర్ షో­య­బ్ మా­లి­క్‌­ను పె­ళ్లి చే­సు­కు­ని.. కొంత కాలం తర్వాత వి­డా­కు­లు తీ­సు­కు­ని ఓ బి­డ్డ­కు జన్మ­ని­చ్చా­రు సా­ని­యా. వీ­రి­ద్ద­రి మధ్య తలె­త్తిన వి­భే­దా­ల­తో కొ­డు­కు­తో కలి­సి సిం­గి­ల్ మద­ర్‌­గా సా­ని­యా జీ­వి­స్తు­న్నా­రు. అయి­తే సా­ని­యా మి­ర్జా ఓ టా­లీ­వు­డ్ హీ­రో­తో డే­టిం­గ్ చే­స్తోం­ద­నే వా­ర్త­లు వస్తు­న్నా­యి. వీ­రి­ద్ద­రూ ఒక కాఫీ షా­ప్‌­లో మీట్ అయ్యా­ర­ని.. క్లో­జ్‌­గా ఉన్న ఫో­టో­లు కూడా బయ­ట­కు వచ్చి­న­ట్లు సమా­చా­రం. అయి­తే ఆ హీరో పేరు మా­త్రం బయ­ట­కు రా­లే­దు. దీం­తో సా­ని­యా పె­ళ్లి­పై అఫి­షి­య­ల్ అనౌ­న్స్‌­మెం­ట్ త్వ­ర­లో­నే ఉం­డ­ను­న్న­ట్టు సోషల్ మీడియాలో విస్తృ ప్ర­చా­రం జరు­గు­తోం­ది.

గతంలోనూ రూమర్లు

ఇది­లా ఉం­డ­గా గతం­లో కూడా సా­ని­యా మీ­ర్జా ఇలాం­టి రూ­మ­ర్స్ ను ఎదు­ర్కొం­ది. ప్ర­ముఖ క్రి­కె­ట­ర్ మహ­మ్మ­ద్ షమీ­ని ఈమె వి­వా­హం చే­సు­కో­బో­తోం­ది అంటూ వా­ర్త­లు వై­ర­ల్ అయ్యా­యి. అం­తే­కా­దు ఇరు­వు­రి కు­టుంబ సభ్యు­లు ఒప్పు­కు­న్నా­ర­ని.. అం­దు­కే తన కొ­డు­కు సమ­క్షం­లో మళ్లీ పె­ళ్లి చే­సు­కో­బో­తోం­ది అంటూ వా­ర్త­లు రాగా.. ఈ వా­ర్త­ల­ను కొ­ట్టి పడే­శా­రు సా­ని­యా మీ­ర్జా తం­డ్రి. అలా రూ­మ­ర్స్ కి చెక్ పడిం­ది. ఇప్పు­డు టా­లీ­వు­డ్ హీ­రో­తో రెం­డో పె­ళ్లి అంటూ మళ్ళీ ఒక వా­ర్త తె­ర­పై­కి వచ్చిం­ది. ఇం­దు­లో ఎం­త­వ­ర­కు నిజం ఉందో తె­లి­య­దు. కానీ వా­ర్త­లు మా­త్రం తెగ వై­ర­ల్ అవు­తు­న్నా­యి.

సానియా మీర్జా కెరియర్..

ఇక సా­ని­యా మీ­ర్జా కె­రి­య­ర్ వి­ష­యా­ని­కి వస్తే.. భారత టె­న్ని­స్ క్రీ­డా­కా­రి­ణి­గా పేరు సొం­తం చే­సు­కుం­ది. ఆమె మహి­ళల డబు­ల్స్ లో నెం­బ­ర్ వన్ ర్యాం­కు­ను పొం­దిన క్రీ­డా­కా­రి­ణి­గా రి­కా­ర్డ్ చే­సిం­ది. 2003 నుం­డి 2013లో సిం­గి­ల్స్ నుం­డి వి­ర­మణ తీ­సు­కు­నే వరకు ఈమె భా­ర­త­దే­శం లో సిం­గి­ల్స్, డబు­ల్స్ వి­భా­గా­ల­లో నెం­బ­ర్ వన్ క్రీ­డా­కా­రి­ణి గానే గు­ర్తిం­పు సొం­తం చే­సు­కుం­ది. అం­తే­కా­దు అత్య­ధిక పా­రి­తో­ష­కం అం­దు­కు­నే అథ్లె­టి­క్ క్రీ­డా­కా­రి­ణి­గా కూడా పేరు సొం­తం చే­సు­కుం­ది సా­ని­యా మీ­ర్జా. ఇక సా­ని­యా మీ­ర్జా ఆఫ్రో – ఆసి­యా క్రీ­డ­ల్లో ఏకం­గా 14 పథ­కా­లు సా­ధిం­చ­గా.. అం­దు­లో ఆరు బం­గా­రు పథ­కా­లు కూడా ఉన్నా­యి.

Tags:    

Similar News