SHREYAS: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్స్
బీసీసీఐ దీర్ఘకాలిక ఆలోచనలో ఉన్నట్లు వార్తలు.. ఆసియా కప్‌నకు ఎంపిక కాని శ్రేయస్స్ అయ్యర్... అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు... వన్డే కెప్టెన్సీ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టే యోచన;
ఆసియా కప్ 2025 టీమిండియా జట్టు ఎంపికలో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రేయస్స్ అయ్యర్‌కు వన్డే సారధ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నప్పటికీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యాన్ స్థానంలో వేరొకరికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ చూస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే వన్డే వైస్ కెప్టెన్ గా ఉంటున్న శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ దక్కాలి. అయితే ఇక్కడే బీసీసీఐ మరోలా ఆలోచిస్తోందని తెలుసోంది. తాజా నివేదికల ప్రకారం వన్డే పగ్గాలు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.
సాధ్యం కాకపోవడంతోనే...
నిన్నటివరకు శుభమాన్ గిల్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ చూస్తున్నట్టు సమాచారం. ఆసియా కప్ కు గిల్ ను టీ20 వైస్ కెప్టెన్ గా ప్రకటించి బీసీసీఐ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. మూడు ఫార్మాట్ లలో గిల్ కు బాధ్యతలు అప్పగిస్తే పనిభారం ఎక్కువ అవుతుందని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాడిని కెప్టెన్‌గా చేయడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వివరించాయి. ఏడాది పొడవునా టోర్నమెంట్లు, టూర్ లు ఉండడంతో మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్ గా నియమించడం అతనికి శక్తికి మించిన పని అవుతుందని బోర్డు భావిస్తోంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఫేర్వెల్ సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
2027 వరకూ రోహితేనా..?
ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు సారథిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గిల్‌ను పొట్టి ఫార్మాట్‌కు వైస్ కెప్టెన్‌గా చేయడంతో భవిష్యత్తులో అతడికే సారథ్యం అప్పగిస్తారని ఖరారు అయిపోయింది. ఇక రోహిత్ శర్మ వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకూ ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే, రోహిత్‌ను వన్డే సారథ్యం నుంచి తప్పించి శ్రేయస్‌ను వరల్డ్ కప్ 2027 వరకూ నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ తర్వాత కూడా గిల్‌ను ఏకైక సారథిగా చేయకపోవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ నాటికి అతడికి 40+ అవుతాయి. గిల్‌కే బాధ్యతలు అప్పగించాలని తొలుత మేనేజ్మెంట్ భావించింది. కానీ, వర్క్‌లోడ్ కారణంగా అతడి ప్రదర్శనపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో వన్డేలకు రోహిత్ బదులు శ్రేయస్‌ను సారథిగా నియమిస్తే బాగుంటుందనే వాదనా ఉంది. ఆసియా కప్ తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశమై రోహిత్, విరాట్ భవితవ్యంపై చర్చిస్తారని.. శ్రేయస్‌ను కెప్టెన్‌గా చేస్తారన్న కథనాలు వచ్చాయి.