Asia Cup : ట్రోఫీని తీసుకోకపోవడంపై స్పందించిన స్కై

Update: 2025-09-29 09:30 GMT

ఆసియా కప్ ట్రోఫీని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా తీసుకోకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ నిర్ణయం పూర్తిగా గ్రౌండ్ లో తన టీం తీసుకుందని, ఎలాంటి ఈ-మెయిల్ గురించి తనకు తెలియదని స్పష్టం చేశాడు. తన 14 మంది సహచర ఆటగాళ్లే నిజమైన ట్రోఫీలని, వారితో గడిపిన క్షణాలు శాశ్వత జ్ఞాపకాలని చెప్పాడు. ట్రోఫీ లేకపోయినా ఛాంపియన్ గా గుర్తుండటమే ముఖ్యమంటూ.. పాక్ జర్నలిస్టుల ప్రశ్నలకు సూర్యా సమాధానమిచ్చాడు. ఈ ఆటలో తనకు దక్కిన ప్రైజ్ మనీని భారత సైన్యానికి, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.

Tags:    

Similar News