Gujarat Titans : స్లో ఓవర్ రేట్ .. గిల్ కు ఫైన్

Update: 2024-03-27 07:00 GMT

గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) బిగ్ షాక్ తగిలింది. గిల్ కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. నిన్న సీఎస్కేతో మ్యాచు‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్ గిల్ కావడం గమనార్హం.

''ఐపీఎల్-2024లో మార్చి 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేట్‌ కొనసాగించినందుకు ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించాం. ఐపీఎల్ నియమావళి మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించాం'' అని ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ వేదికగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో 63 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసిది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో),రచిన్ రవీంద్ర (46; 20 బంతుల్లో), రుతురాజ్ గైక్వాడ్ (46; 36 బంతుల్లో) సత్తాచాటారు.

Tags:    

Similar News