టర్కీకి చెందిన యువ ఆటగాడు, టర్కీ మెస్సీగా పేరు పొందిన అర్దా గులర్‌ని లాలిగా క్లబ్ రియల్ మాడ్రిడ్ సొంతం చేసుకుంది. రూ.౩౦ మిలియన్ యూరోలకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటగా 20 మిలియన్ యూరోలు ఇవ్వనుండగా, ప్రదర్శన ఆధారంగా మరో 10 మిలియన్ యూరోలను ఇవ్వడానికి అతని క్లబ్ ఫెనర్‌బాక్‌తో ఒప్పందం కుదిరింది. 6 సంవత్సరాల కాలానికి ఈ ఒప్పందం కుదిరింది.
అర్దా గులర్ టర్కిష్ కప్‌లో అదరగొడుతూ, ఫెనర్‌బాక్ క్లబ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. గులర్‌ని దక్కించుకోవడానికి మరో ప్రముఖ క్లబ్ బార్సిలోనా కూడా ప్రయత్నాలు చేసింది. కాని చివరికి రియల్ మాడ్రిడ్ డీల్ ఓకే అయింది. 2021లో ఆరంగ్రేటం చేసిన ఈ యువ ఆటగాడు 9 గోల్స్ చేశాడు. టర్కీ జాతీయజట్టు తరఫున 4 మ్యాచ్‌లు ఆడి, యూరో 2024 క్వాలిఫైయర్స్‌లో వేల్స్ జట్టుపై 1 గోల్ కొట్టాడు.
🔝 @10ardaguler 🔝#WelcomeArda pic.twitter.com/ERx34U7DX9
— Real Madrid C.F. (@realmadrid) July 6, 2023
"ఫిఫా నిబంధనల ప్రకారం మా ఆటగాడు గులర్‌ని, స్పెయిన్‌కి చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ ట్రాన్స్‌ఫర్ ఫీజుతో పాటు, 20 మిలియన్ యూరోలు, అదనంగా మరో 10 మిలియన్ యూరోలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం." అని ఫెనర్‌బాక్ క్లబ్ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం రియల్‌మాడ్రిడ్ అభిమానుల ముందు గులర్‌ని పరిచయం చేయనున్నారు.
రియల్ మాడ్రిడ్ ఇప్పటికే బెల్లింగ్‌హాం, జోసెల్, ఫ్రాన్ గార్సియా వంటి ప్లేయర్లతో ఈ సమ్మర్ ట్రాన్స్‌ఫర్ విండోలో ఒప్పందాలు చేసుకుంది. తన జట్టు సీనియర్ ఆటగాళ్లు టోనీ క్రూజ్, లూకా మాడ్రిక్‌లతో కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించుకుంది.