Sachin Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు తెలుసా..?

Update: 2024-04-24 07:26 GMT

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 51వ బర్త్ డేను ఫ్యాన్స్ సంబరంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ సాధించలేని మైలురాళ్లను సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో సాధించాడు.

ప్రతి యువ ఆటగాడు సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని అతనిలా గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలని కోరుకుంటాడు. రోహిత్ శర్మ నుంచి విరాట్ కోహ్లి వరకు పెద్ద ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా భావిస్తారు. సచిన్ గురించి ఆసక్తికరమైన అంశాలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

సచిన్ 1989లో కేవలం 16 ఏళ్ల వయసులో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. సచిన్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడారు. ఫస్ట్ మ్యాచ్ లో ముక్కుకు గాయమైనా సచిన్ భయపడలేదు. తిరుగులేని రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ పేరిట 34 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. 100 సెంచరీలు చేసిన రికార్డు కూడా సచిన్ పేరు మీదనే ఉంది. సచిన్ 51 టెస్టులు, 49 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లలలో 15వేల 921 పరుగులు చేశాడు. 463 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్ 18వేల 426 రన్స్ కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ కూడా సచినే. క్రికెట్ శిఖరం లాంటి సచిన్‌కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది. 2013లో వెస్టిండీస్‌తో వాంఖడేలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత కెరీర్‌కు ముగించిన సచిన్.. ఐపీఎల్ లో మెంటార్ గా ఇప్పటికీ అలరిస్తున్నాడు.

Tags:    

Similar News