SRH: వర్షంతో మ్యాచ్ రద్దు... ప్లేఆఫ్స్ కు సన్ రైజర్స్

నాలుగేండ్ల తర్వాత నాకౌట్‌కు

Update: 2024-05-17 02:00 GMT

పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ లో మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో  ‘ఆరెంజ్‌ ఆర్మీ’ అభిమానుల నాలుగేండ్ల ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరగాల్సిన ‘డూ ఆర్‌ డై’ మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలా ఓ పాయింట్‌ కేటాయించడంతో ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ చేరింది. 2020 తర్వాత సన్‌రైజర్స్‌ నాకౌట్‌ దశకు చేరుకోవడం ఇదే ప్రథమం. 2021, 2022లో 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. గతేడాది పదో స్థానంలో నిలవడం అభిమానులను బాధించింది.

టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ లో ప్రవేశించాయి. ఇప్పుడు, సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో, అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

ఇక, నాలుగో బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ ఎల్లుండి (మే 18) బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న బెంగళూరును నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తే, లక్ష్యఛేదనను 18.1 ఓవర్లలో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా నాలుగో బెర్తును ఖాయం చేసుకుంటుంది. లేదా, ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలిచిన పట్టు నాలుగో బెర్తును దక్కించుకుంటుంది.

Tags:    

Similar News