Srilanka Vs India: టాస్‌ గెలిచిన శ్రీలంక... తుది జట్లు ఇవే

Srilanka Vs India: టీమిండియా-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచింది.

Update: 2021-07-20 09:34 GMT

 టీమిండియా-శ్రీలంక 

Srilanka Vs India: టీమిండియా-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన లంక సారథి దసున్‌ శనక మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌ ఇప్పుడు మెరుగ్గా అనిపిస్తోందని అంటున్నాడు. టీమ్‌ఇండియాలో మార్పులేమీ లేవు.

ధావన్‌ సేన శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌పై కన్నేసింది. కాసేపట్లో జరిగే రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంకను మరోసారి చిత్తుచేసి ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను గెలవాలన్న పట్టుదలతో ఉంది. తొలి వన్డేలో కెప్టెన్‌ ధావన్‌ భాద్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడగా.. యువ ఆటగాళ్లు పృథ్వీషా, ఇషాన్‌ కిషన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ తోడవడంతో.. లంక నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది.

అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్‌ కిషన్‌ అర్ధశతకంతో ఆకట్టుకోగా. తొలి మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ కూడా లంక బౌలర్ల భరతం పట్టాడు. ఇంక రెండో మ్యాచ్‌కు టీమిండియాలో పెద్దగా మార్పులుండకపోవచ్చు. తొలిమ్యాచ్‌లో డేరింగ్‌ షాట్లతో ఆకట్టుకున్న ఓపెనర్‌ పృథ్వీ షా భారీస్కోరు చేయాల్సిన అవసర ముంది. చాలారోజుల తర్వాత కలిసి బరిలోకి దిగిన కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ జోడీ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఐదు ఓవర్లు వేయడం జట్టుకు మేలు చేసే అంశం.. మరోవైపు ప్రాక్టీస్‌లో గాయపడ్డ సంజు శాంసన్‌ అందుబాటులో రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తుది జట్టులో శాంసన్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

మరోవైపు బలహీనంగా కనిపిస్తోన్న శ్రీలంక జట్టు.. సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో లంక ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించినా.. పెద్ద ఇన్నింగ్స్‌గా దానిని మలచడంలో విఫలమయ్యారు. ఈ లోపాన్ని సరిదిద్దుకొని.. భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని లంక ఆటగాళ్లు చూస్తున్నారు. ఏదో అద్భుతం జరిగే తప్ప సిరీ‌స్‌ను కాపాడుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

తుదిజట్లు ఇవే:

ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, కిషన్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, చాహాల్

దసున్‌ శనక (కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (wk), భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, హసరంగ, చమిక కరుణరత్న, దుష్మంత చమీర, కసున్ రాజత, సందకన్.

Tags:    

Similar News