Gymkhana Ground : గాయపడినవారికి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఫ్రీ షో..
Gymkhana Ground : ఇటీవల సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాటలో... గాయపడిన క్రికెట్ అభిమానులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో పరామర్శించారు;
Gymkhana Ground : ఇటీవల సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తొక్కిసలాటలో... గాయపడిన క్రికెట్ అభిమానులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో పరామర్శించారు. బాధితుల నుంచి తొక్కిసలాట ఘటన వివరాలు తెలుసుకున్నారు. నాటి జింఖానా గ్రౌండ్ ఘటన దురదృష్టకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యనించారు. గాయపడినవారికి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించారు.
అటు జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో చిక్కుకుని గాయాలతో ఊపిరాక ఇబ్బందిపడిన వారికి..ప్రథమిక చికిత్స అందించిన బేగంపేట మహిళా కానిస్టేబుళ్లు నవీన, విమలను మంత్రి అభినందించారు. నవీనకు పదోన్నతి మరో కానిస్టేబుల్ విమలకు రివార్డు అందించాలని హైదరాబాద్ కమిషనరేట్‌కు శ్రీనివాస్‌గౌడ్ సిఫార్సు చేశారు.