IPL 2024 : ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్

Update: 2024-04-05 06:28 GMT

ఐపీఎల్ ల్ భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడాయి. 3 మ్యాచుల్లో 2 గెలిచిన చెన్నై 3వ స్థానంలో ఉండగా.. 3మ్యాచుల్లో 1 గెలిచిన హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ 5వ స్థానానికి చేరుకుంటుంది. ముంబాయ్ పై సన్‌రైజర్స్ చేసిన విధ్వంసాన్ని నేడు రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్‌కు ఆటంకాలు తొలగాయి. నాలుగైదు గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో శుక్రవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ యధాతథంగా జరగనుంది.

మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు ఎలక్ట్రిసిటీ అధికారులు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ నిలిపివేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. సామాన్యుడు ఒక్క నెల చెల్లించకపోతే ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేసేవారు. బిజినెస్ భారీగా ఉండే స్టేడియం రూ.1.67కోట్ల బిల్లు కట్టనంత వరకూ ఏం చేశారు?’ అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ స్టార్టింగ్‌లోనే బిల్లుల వసూలుపై దృష్టి పెట్టాల్సిందని సూచిస్తున్నారు.

Full View


Tags:    

Similar News