SURYAKUMAR: "తుది జట్టు ఎంపికే పెద్ద తలనొప్పి"

భారత కెప్టెన్ సూర్య కీలక వ్యాఖ్యలు

Update: 2025-11-09 06:30 GMT

ఆస్ట్రే­లి­యా­తో జరి­గిన టీ 20 సి­రీ­స్‌­ను 2-1తో టీ­మిం­డి­యా కై­వ­సం చే­సు­కుం­ది. వర్షం కా­ర­ణం­గా ఈ ఐదు టీ20ల సి­రీ­స్‌ మూడు మ్యా­చ్‌ల సి­రీ­స్‌­గా మా­రి­పో­యిం­ది. తొలి మ్యా­చ్ కూడా వర్షం కా­ర­ణం­గా రద్ద­యిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ సి­రీ­స్ వి­జ­యా­నం­త­రం మా­ట్లా­డిన సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్.. తమ ఆట­గా­ళ్ల అద్భు­త­మైన ప్ర­ద­ర్శ­న­తో ఈ వి­జ­యం సా­ధ్య­మైం­ద­ని తె­లి­పా­డు. 'కా­న్‌­బె­ర్రా­లో జరి­గిన తొలి మ్యా­చ్ కూడా పూ­ర్త­వ్వా­ల­ని కో­రు­కు­న్నాం. కానీ వర్షం మన ని­యం­త్ర­ణ­లో లేని వి­ష­యం. 0-1తో వె­ను­కం­జ­లో ని­లి­చిన స్థి­తి నుం­చి మేం పుం­జు­కు­న్న వి­ధా­నం అద్బు­తం. ఈ గె­లు­పు క్రె­డి­ట్ ఆట­గా­ళ్ల­దే. పే­స­ర్లు, స్పి­న్న­ర్లు అద్భు­తం­గా రా­ణిం­చా­రు. బు­మ్రా-అర్ష్‌­దీ­ప్ సిం­గ్‌­ల­ది చాలా ప్ర­మా­ద­క­ర­మైన కాం­బి­నే­ష­న్. అక్ష­ర్, వరు­ణ్ బలా­న్ని ప్ర­ద­ర్శి­స్తు­న్నా­రు. గత మ్యా­చ్‌­లో వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ కూడా రా­ణిం­చా­డు. మా ఆట­గా­ళ్లం­తా ఇప్ప­టి­కే చాలా టీ20 క్రి­కె­ట్ ఆడా­రు. జట్టు కోసం ఏమై­నా చే­య­గ­ల­రు. జట్టు­లో­ని ఆట­గా­ళ్లం­తా అద్భు­తం­గా రా­ణి­స్తు­న్నం­దున తుది జట్టు ఎం­పిక స్వీ­ట్ హె­డె­క్ మా­రిం­ది. ఆస్ట్రే­లి­యా, సౌ­తా­ఫ్రి­కా, న్యూ­జి­లాం­డ్ వంటి మూడు బల­మైన జట్ల­తో ఆడటం.. ప్ర­పం­చ­క­ప్ టో­ర్నీ­కి గొ­ప్ప సన్నా­హ­కం­గా ఉం­టుం­ది.

సెంచరీతో రెచ్చిపోయిన జురెల్

టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­‌­ర్ బ్యా­ట­‌­ర్ ధ్రు­వ్ జు­రె­ల్ త‌న కె­రీ­ర్‌­లో­నే అత్యు­త్త­‌మ ఫా­మ్‌­ను క‌­న­‌­బ­‌­రి­స్తు­న్నా­డు. సౌ­తా­ఫ్రి­కా-తో జరు­గు­తు­న్న రెం­డో అనా­ధి­కా­రిక టె­స్టు­లో భా­ర­‌త-ఎ జ‌­ట్టు­కు ప్రా­తి­ని­థ్యం వ‌­హి­స్తు­న్న జు­రె­ల్ సెం­చ­‌­రీల మోత మ్రో­గిం­చా­డు. తొలి ఇన్నిం­గ్స్‌­లో త‌న సూ­ప­‌­ర్ జెం­చ­‌­రీ­తో జ‌­ట్టు­ను ఆదు­కు­న్న జు­రె­ల్‌.. ఇప్పు­డు రెం­డో ఇన్నిం­గ్స్‌­లో­నూ శ‌­త­‌­క్కొ­ట్టా­డు. జు­రె­ల్ 159 బం­తు­ల్లో 11 ఫో­ర్ల సా­యం­తో త‌న ఆరువ ఫ‌­స్ట్ క్లా­స్ సెం­చ­‌­రీ మా­ర్క్‌­ను అం­దు­కు­న్నా­డు. తొ­లుత హర్ష్‌ దూ­బే­తో కలి­సి కీలక భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పిన ధ్రు­వ్‌.. ఆ తర్వాత కె­ప్టె­న్‌ పం­త్‌­తో స్కో­రు బో­ర్డు­ను పరు­గు­లు పె­ట్టిం­చా­డు. జు­రె­ల్‌ ఓవ­రా­ల్‌­గా 169 బం­తు­లు ఎదు­ర్కొ­న్న జు­రె­ల్‌.. 15 ఫో­ర్లు, ఒక​ సి­క్స­ర్‌­తో 127 పరు­గు­లు చేసి ఆజే­యం­గా ని­లి­చా­డు. సౌ­తా­ఫ్రి­కా ‘ఏ’ ముం­దు 418 పరు­గుల భారీ లక్ష్యం పె­ట్టిం­ది. ఓవ­ర్‌­నై­ట్ స్కో­రు 78/3తో శని­వా­రం ఆట కొ­న­సా­గిం­చిన భా­ర­త్ ‘ఏ’ జట్టు 382/7 స్కో­రు వద్ద డి­క్లే­ర్డ్ ఇచ్చిం­ది. రెం­డో ఇన్నిం­గ్స్‌­లో మొ­ద­ట్లో భా­ర­త్ ‘ఏ’ తడ­బా­టు­కు గు­రైం­ది. రెం­డో రోజే మూడు వి­కె­ట్లు కో­ల్పో­గా.. రా­హు­ల్(27), కు­ల్దీ­ప్(16) కూడా కా­సే­పు పో­రా­డి వి­కె­ట్లు పా­రే­సు­కు­న్నా­రు. దీం­తో 116 పరు­గు­ల­కే 5 వి­కె­ట్లు పడ్డా­యి. క్రీ­జు­లో­కి వచ్చిన పంత్ కా­సే­ప­టి­కే రి­టై­ర్డ్ హర్ట్‌­గా వె­ను­ది­రి­గా­డు. ఈ పరి­స్థి­తు­ల్లో ధ్రు­వ్ జు­రె­ల్ మరో­సా­రి జట్టు­కు అం­డ­గా ని­లి­చా­డు. అసా­ధా­రణ ఇన్నిం­గ్స్ ఆడిన అతను 170 బం­తు­ల్లో 127 పరు­గు­లు చేసి అజే­యం­గా ని­లి­చా­డు. మరో­వై­పు, హర్ష్ దూబే(84) కూడా చె­ల­రే­గా­డు. వచ్చిన అవ­కా­శా­న్ని సద్వి­ని­యో­గం చే­సు­కు­న్న అతను ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­ను ము­ప్పు­తి­ప్ప­లు పె­ట్టా­డు. జు­రె­ల్, దూబే రె­చ్చి­పో­వ­డం­తో స్కో­రు 300 మా­ర్క్ అం­దు­కుం­ది. ఈ క్ర­మం­లో దూబె తృ­టి­లో సెం­చ­రీ చే­జా­ర్చు­కు­న్నా­డు. దూబె అవు­టైన తర్వాత తి­రి­గి మై­దా­నం­లో­కి వచ్చిన పంత్ ధనా­ధ­న్ ఇన్నిం­గ్స్ ఆడా­డు.

Tags:    

Similar News