T 20 Match : హైదరాబాద్‌కు చేరుకున్న క్రికెట్ టీమ్స్..
T 20 Match : ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్స్ హైదరాబాద్‌కు వచ్చేశాయి. ఇక ఆదివారం ఉప్పల్ వేదికగా టీ20 కప్ కోసం తుది పోరు సమరం జరగనుంది;
T20 Match : ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్స్ హైదరాబాద్‌కు వచ్చేశాయి. ఇక ఆదివారం ఉప్పల్ వేదికగా టీ20 కప్ కోసం తుది పోరు సమరం జరగనుంది. ప్రస్తుతం క్రికెటర్స్ పార్క్ హయత్, తాజ్‌కృష్ణ హోటల్స్‌లో స్టే చేస్తున్నారు. నాగపూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాగానే ఆటగాళ్లకు అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. క్రికెటర్స్‌ను చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. పోలీసుల బందోబస్త్ మధ్య క్రికెటర్లను హోటల్స్‌కి తరలించారు.
ఆదివారం ఉదయం ఉప్పల్ స్టేడియంలో రెండు టీంలు నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి. ఇక రాత్రి 7.30గంటలకు టీ20 సమరం ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మైదానంలోకి ప్రతి వ్యక్తి కదలికలను పోలీసులు పర్యవేక్షించనున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు, స్నేక్ క్యాచర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసిన HCA ప్రేక్షకులకు కల్పించాల్సిన సౌకర్యాలను మాత్రం గాలికి వదిలేసిందనే అపవాదును మూటగట్టుకుంది. సగానికి పైగా కుర్చీలు కూర్చోవడానికి వీలులేకుండా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. టికెట్ల అమ్మకాలు, స్టేడియంలో సీట్ల తీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. మూడేళ్ల తర్వాత జరిగే మ్యాచ్‌పై ఇంతలా నిర్లక్ష్యం ఏంటని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.