T20 WORLD CUP: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌..!

భా­ర­త్, శ్రీ­లంక సం­యు­క్తం­గా ఆతి­థ్య­మి­వ్వ­ను­న్న టీ20 ప్ర­పం­చ­క­ప్‌

Update: 2025-09-11 07:00 GMT

వచ్చే ఏడా­ది భా­ర­త్, శ్రీ­లంక సం­యు­క్తం­గా ఆతి­థ్య­మి­వ్వ­ను­న్న టీ20 ప్ర­పం­చ­క­ప్‌ ఫి­బ్ర­వ­రి 7వ తేదీ నుం­చి మా­ర్చి 8వ తేదీ వరకు జరి­గే అవ­కా­శం ఉన్న­ట్లు వా­ర్త­లు వస్తు­న్నా­యి. పూ­ర్తి షె­డ్యూ­లు ఇంకా ఖరా­రు కా­క­పో­యి­నా ఈ టో­ర్నీ­కి సం­బం­ధిం­చిన మ్యా­చ్‌­లు భా­ర­త్‌­లో­ని 5 స్టే­డి­యా­ల­తో పాటు శ్రీ­లం­క­లో­ని రెం­డు గ్రౌం­డ్‌­ల­లో జర­గ­ను­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఇక, సరి­హ­ద్దు ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో పాక్ తమ అన్నీ మ్యా­చ్‌­ల­ను శ్రీ­లం­క­లో ఆడ­నుం­ది. ఈ టో­ర్నీ­లో మొ­త్తం 20 జట్లు పోటీ పడ­ను­న్నా­యి. అన్ని జట్ల­ను నా­లు­గు గ్రూ­పు­లు­గా వి­భ­జిం­చ­ను­న్నా­రు. ఆ తర్వాత సూ­ప­ర్‌ 8 దశ, సె­మీ­ఫై­న­ల్స్, ఫై­న­ల్‌ ఉం­టా­యి. అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌ కౌ­న్సి­ల్‌ 2026 టీ20 ప్ర­పం­చ­క­ప్‌ ఫై­న­ల్‌ అహ్మ­దా­బా­ద్‌ లేదా కొ­లోం­బో­లో జరి­గే అవ­కా­శం ఉంది. ఒక­వేళ పా­కి­స్తా­న్‌ జట్టు టీ20 వర­ల్డ్‌­క­ప్‌ ఫై­న­ల్‌­కు అర్హత సా­ధి­స్తే… తుది సమరం కొ­లం­బో­లో జరు­గు­తుం­ది. లీగ్ దశ­లో­నే దా­యా­ది జట్టు ఇం­టి­కి వె­ళ్తే.. ఫై­న­ల్ పోరు అహ్మ­దా­బా­ద్ లో జర­గ­నుం­ది. ఇక, డి­ఫెం­డిం­గ్‌ చాం­పి­య­న్‌ భా­ర­త్‌­తో పాటు శ్రీ­లంక, అఫ్గా­ని­స్తా­న్, ఆస్ట్రే­లి­యా, బం­గ్లా­దే­శ్, ఇం­గ్లాం­డ్, దక్షి­ణా­ఫ్రి­కా, అమె­రి­కా, వె­స్టిం­డీ­స్, న్యూ­జి­లాం­డ్, పా­కి­స్తా­న్, ఐర్లాం­డ్, కె­న­డా, నె­ద­ర్లాం­డ్స్, ఇటలీ జట్లు ఇప్ప­టి­కే టీ20 ప్ర­పం­చ­క­ప్‌­న­కు అర్హత సా­ధిం­చా­యి. ఈ మ్యాచుల కోసం ఏర్పాటు పూర్తయ్యాయి.

ఇం­దు­లో ఇటలీ జట్టు మొ­ట్ట­మొ­ద­టి­సా­రి ప్ర­పం­చ­క­ప్‌­కు అర్హత సా­ధిం­చిం­ది. ఇక మి­గి­లిన ఐదు స్థా­నాల కోసం క్వా­లి­ఫ­యిం­గ్‌ టో­ర్నీ­లు జరి­గే అవ­కా­శం ఉంది. ఆఫ్రి­కా క్వా­లి­ఫ­య­ర్స్‌ నుం­చి 2 జట్లు, తూ­ర్పు ఆసి­యా పసి­ఫి­క్‌ క్వా­లి­ఫ­య­ర్స్‌ నుం­చి మరో 3 టీ­మ్స్ ఈ టో­ర్నీ­కి అర్హత సా­ధిం­చే ఛా­న్స్ ఉంది. 2024లో అమె­రి­కా, వె­స్టిం­డీ­స్‌ సం­యు­క్తం­గా ఇచ్చిన ఆతి­థ్యం­లో జరి­గిన టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను రో­హి­త్‌ శర్మ సా­ర­థ్యం­లో­ని భారత జట్టు ఘన వి­జ­యం సా­ధిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే.

షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోని ఇండియా - పాక్ కెప్టెన్లు

ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­లో కె­ప్టె­న్ల ప్రె­స్ మీట్ చర్చ­కు దారి తీ­సిం­ది. ఈ మీ­ట్‌­లో టో­ర్నీ­లో పా­ల్గొం­టు­న్న 8 జట్ల కె­ప్టె­న్లు పా­ల్గొ­ని, ట్రో­ఫీ­తో ఫో­టో­ల­కు ఫో­జు­లు ఇచ్చా­రు. ఆఫ్ఘా­న్ కె­ప్టె­న్ రషీ­ద్ ఖా­న్‌­తో చాలా స్నే­హం­గా ఉంటూ, చాలా సేపు మా­ట్లా­డిన భారత టీ20 కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్, పా­కి­స్తా­న్ కె­ప్టె­న్‌­తో షేక్ హ్యాం­డ్ ఇచ్చేం­దు­కు కూడా ఇష్ట­ప­డ­లే­దు. కె­ప్టె­న్స్ మీ­ట్‌­లో కె­ప్టె­న్లు అం­ద­రూ ఒక­రి­కొ­క­రు షేక్ హ్యాం­డ్ ఇచ్చు­కో­వ­డం ఆన­వా­యి­తీ. అయి­తే భారత సా­ర­థి, పాక్ సా­ర­థి­తో హ్యాం­డ్ షే­క్స్ చే­య­క­పో­వ­డం చర్చ­నీ­యాం­శ­మైం­ది. పహ­ల్గా­మ్ ఉగ్ర­దా­డి తర్వాత ఇం­డి­యా, పా­కి­స్తా­న్ మధ్య సం­బం­ధా­లు పూ­ర్తి­గా తె­గి­పో­యా­యి. ఒకా­నొక సమ­యం­లో యు­ద్ధ వా­తా­వ­ర­ణం నె­ల­కొ­ని, ఐపీ­ఎ­ల్ 2025 టో­ర్నీ­కి మధ్య­లో వా­రా­ని­కి పైగా గ్యా­ప్ వచ్చిం­ది.

Tags:    

Similar News