Indian Cricket Team: బీచ్‌లో ఛిల్ అయిన భారత ఆటగాళ్లు
అక్టోబర్‌లో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కోణంలో ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ సిరీస్ ప్రదర్శనను బట్టే ఆటగాళ్ల ఎంపికలపై అంచనాలకు రావచ్చు.;
విండీస్‌తో వన్డే సిరీస్ జులై 27న ఆరంభమవనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని యువ ఆటగాళ్లలతో కూడిన జట్టు విండీస్‌తో తలపడనుంది.
యువఆటగాళ్లు వీరంతా కొద్ది రోజుల నుంచి విండీస్‌లో ఉంటూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బీచుల్లో ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. బార్బడోస్ బీచ్‌లో హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఉస్మాన్ మాలిక్‌లు కలిసి దిగిన ఫోటోలను హార్ధిక్ పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భారత ఆటగాళ్లకు బార్బడోస్‌లో పసిఫిక్ మహాసముద్రం పక్కన ఉన్న హిల్టన్ రిసార్ట్స్‌లో బస ఏర్పాటు చేశారు.
యువ ఆటగాళ్లంతా చివరగా ఐపీఎల్‌లోనే కనిపించారు. విండీస్‌తో ఆడిన టెస్టు జట్లలో కొద్ది మందికి మాత్రమే చోటు దక్కింది. ఇప్పుడు వీరంతా కలిసి ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ కోణంలో ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ సిరీస్ ప్రదర్శనను బట్టే ఆటగాళ్ల ఎంపికలపై అంచనాలకు రావచ్చు.
ఇక వెస్టిండీస్ గత నెలలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అర్హత సాధించలేకపోవడంతో ఈ వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనడం లేదు.
భారత్ vs వెస్టిండీస్ వన్డే సిరీస్
మొదటి వన్డే - జూలై 27
రెండో వన్డే - 29 జూలై
మూడో వన్డే - ఆగస్టు 1
వన్డే సిరీస్‌కు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ యాదవ్ సిరాజ్, ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్