TEAM INDIA: టీమిండియా మరీ ఇంత చెత్త ఫీల్డింగా.?
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చాలా పేలవంగా టీమిండియా ఫీల్డింగ్
ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ.. భారత ఫీల్డింగ్ మాత్రం చాలా పేలవంగా ఉండడం ఇప్పుడు ఆందోళన పరుస్తోంది. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు ఫీల్డింగ్‌లో లోపాలు ఇప్పుడు ఆందోళన పరుస్తోంది. గ్రూప్ దశలో టీమ్ఇండియాపై 127 పరుగులే చేసిన పాక్.. ఈ మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యాన్ని నిలపగలిగిందంటే ఆ జట్టు బ్యాటర్లకు దక్కిన జీవన దానాలే కారణం. పాక్ ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ పరుగుల ఖాతా తెరవకముందే వెనుదిరగాల్సింది. హార్దిక్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి థర్డ్ మ్యాన్ దిశగా ఫర్హాన్ షాట్ ఆడగా.. అంత కష్టమేమీ కాని క్యాచ్‌ను అభిషేక్ వదిలేశాడు. బంతిని అంచనా వేయడంలో అతను పొరబడ్డాడు.
ఇక వరుణ్ చక్రవర్తి వేసిన అయిదో ఓవర్లో అయూబ్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను కుల్దీప్ నేలపాలు చేశాడు. 8వ ఓవర్లో ఫర్హాన్ ఇచ్చిన ఓ క్లిష్టమైన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద చేజారింది. అక్కడ కూడా తప్పు చేసింది అభిషేకే. గిల్ కూడా ఓ క్యాచ్‌ను వదిలేశాడు. 19వ ఓవర్లో ఫహీమ్ అష్రాఫ్కు అతడు జీవనదానాన్ని ఇచ్చాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఫీల్డింగ్‌లో ఎంతో తీవ్రత చూపించే భారత ఆటగాళ్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఇలా ఇలా తడబడడం ఆశ్చర్యం కలిగించేదే. అనంతరం పాక్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏమీ సాగలేదు. అభిషేక్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షహీన్ బౌలింగ్‌లో నవాజ్ క్యాచ్‌ను చేజార్చాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
తొలి ఓవర్లోనే పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద్ ఫర్హాన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే ఫర్హాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ అవకాశంతో అతను హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని ఫర్హాన్ భారీ షాట్ ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ బంతిని అంచనా వేయడంలో విఫలమై నేలపాలు చేశాడు. వరుణ్ చక్రవర్తీ వేసిన ఐదో ఓవర్లో సైమ్ అయుబ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కుల్దీప్ యాదవ్ వదిలేసాడు.