మైనారిటీలపై వివక్ష కారణంగానే తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నారు. పాక్ తరఫున ఆడుతున్న సమయంలో మిగిళిన వాళ్లతొ సమానంగా విలువదక్కేది కాదని, ఆప్రీది,షోయబ్ అక్తర్ తరచుగా మతం మారమని బలవంతం చేసేవారని తెలిపారు. ఇంజమామ్ మాత్రం తనకు మద్దతుగా ఉండేవారన్నారు. ఆ కారణంగానే USAలో స్థిరపడాల్సి వచ్చిందన్నారు. పాక్ తరఫున ఆడిన హిందు క్రికెటర్లలో డానిష్ కనేరియా 2వ వారు. "పాకిస్థాన్ తరఫున నేను నా శాయశక్తులా ఆటతీరు ప్రదర్శించాను.అయితే,నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే.షోయబ్ అక్తర్,షాహిద్ అఫ్రిదీ సహా కొంతమంది ఆటగాళ్లు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. నాకు అసలు సహకారం ఇవ్వలేదు. కనీసం నాతో కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు. షాహిద్ అఫ్రిదీ అయితే మరీ ఎక్కువగా మతం మారమని ఒత్తిడి చేసేవాడు. ఇది చాలాసార్లు జరిగింది. ప్రతి సందర్భంలోనూ అదే చెప్పేవాడు. కానీ, ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం ఎప్పుడూ అటువంటి విషయాలను ప్రస్తావించేవాడు కాదు," అని కనేరియా స్పష్టం చేశాడు.