RCB : ఆర్సీబీ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్?

Update: 2024-09-25 15:00 GMT

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ రిటైన్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ముగ్గురు స్టార్‌ క్రికెటర్లను ఆర్సీబీ విడుదల చేసిందట. రిటెన్షన్‌, రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌తో కలిపి ఆరుగురిని తమవద్ద ఉంచుకొనే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను ఆర్సీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్‌, రజత్ పటీదార్, విల్‌జాక్స్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ఘోరంగా విఫలమైన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్ లను ఆర్సీబీ పక్కన పెట్టనున్నట్లు సమాచారం. నవంబర్‌ రెండో వారంలో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా దుబాయ్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై, దిల్లీ, కోల్‌కతా కూడా తమ రిటైన్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News