వారి వల్లే ఓడిపోయా.. ఒలింపిక్స్‌లో ఓటమిపై మేరీ కోమ్ కీలక వ్యాఖ్యలు
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఓటమి..అందరినీ షాక్‌కు గురిచేసింది.;
Mary Kom
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఓటమి..అందరినీ షాక్‌కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరి ఓడింది. ప్రిక్వార్టర్స్ బౌట్‌లో మూడింట్లో రెండు రౌండ్లు గెలిచినా మేరీ ఓడిపోయినట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగు పదులకు దగ్గరవుతున్నా తనలో సత్తా తగ్గలేదంటూ పతకంపై ఆశలు రేపిన మేరీ.. కీలక పోరులో ఆధిపత్యం కనబర్చినా ఫలితం మాత్రం ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం సాధిస్తుంది అనుకున్న మేరీ ఇంటి ముఖం పట్టింది.
మహిళల 51కేజీల ప్రిక్వార్టర్స్‌లో మేరీకోమ్.. ఇన్‌గ్రిట్ వాలెన్సియాతో తలపడగా.. ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్ చేజార్చుకున్న మేరీ.. ఆ తర్వాత రెండు రౌండ్లు అద్భుతంగా ఆడింది. దీంతో అందరూ ఆమెదే విజయం అనుకున్నారు. అయితే వాలెన్షియాకు అనుకూలంగా ఐదుగురు జడ్జీలు 49 పాయింట్లు ఇవ్వగా, మేరీకోమ్‌కు మాత్రం 46 పాయింట్లు మాత్రమే కేటాయించారు. దీంతో వాలెన్షియా విజయం సాధించింది.
విజేతను ప్రకటించడానికి ముందే మేరీకోమ్ చేతిని పైకెత్తింది. అయితే అప్పటికే ఇంగ్రిట్‌ను విజేతగా ప్రకటించేశారు. దీంతో మేరీకోమ్ ఒక్కసారిగా షాక్ తింది. అనంతరం తేరుకొని చిరునవ్వుతో ఓటమిని అంగీకరించింది. జడ్జీల తప్పిదం వల్లే తాను మ్యాచ్‌ను ఓడినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందని విమర్శించింది. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదన్న మేరీ.. ఓడిపోయానన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.