Tokyo Olympics 2021: ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టిన సింధు
భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ ఆమె విజయం సాధించింది.;
PV Sindhu file photo
Tokyo Olympics 2021: భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ ఆమె విజయం సాధించింది.హాంకాంగ్‌కు చెందిన చెంగ్ యీతో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వరుస గేమ్స్‌లో గెలిచింది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 14 పాయింట్ల వరకూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఆ తర్వాత పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధించింది. దీంతో గ్రూప్ జే టాపర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.