TS : హైదరాబాద్ వేదికగా సానియా మిర్జా చివరి మ్యాచ్
ఎల్బీ స్టేడియంలో తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడుతున్నారు. డబుల్స్‌లో సానియా-బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్- మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొడుతోంది.;
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మిర్జా చివరి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదికైంది. ఎల్బీ స్టేడియంలో తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడుతున్నారు. డబుల్స్‌లో సానియా-బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్- మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొడుతోంది. హైదరాబాద్‌తో తనకి మంచి అనుబంధం ఉందని చెప్పిన సానియా మీర్జా.. ఇక ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్లు వెల్లడించింది. 2003లో టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా మీర్జా.. దాదాపు 20 ఏళ్ల పాటు ఆటలో కొనసాగింది. గత ఫిబ్రవరి 21న దుబాయ్‌లో జరిగిన టోర్నీలో ఫస్ట్ రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసిన సానియా మీర్జా.. టెన్నిస్‌కి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది.