క్రికెట్‌కు ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కాగా అమీర్ గతంలో ఓసారి రిటైర్మెంట్ పలికారు. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వీడ్కోలు పలికారు. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడేశారు.
అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పాక్ తరపున అమీర్ తన కెరీర్‌లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు