IPL: వైభవ్‌ సునామీలో గుజరాత్ గల్లంతు

గుజరాత్ పై విరుచుకుపడ్డ సూర్యవంశీ.. ఈ సీజన్ లో వేగవంతమైన శతకం నమోదు;

Update: 2025-04-29 02:00 GMT

ఆదాన్ స్పోర్ట్స్‌: వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ విజయాన్ని అందించాడు. తుపాను ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మూడు మ్యాచ్ ల్లో చేజింగ్ లో విఫ‌ల‌మైన రాజస్థాన్‌.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయింది. జైపూర్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో వైభ‌వ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ నమోదు చేయడంతో రాజస్థాన్ ఎనిమిది వికెట్లతో ఘ‌న విజ‌యం సాధించింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 209 ప‌రుగులు చేసింది. శుభ‌్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్స‌రలు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అనంత‌రం సూర్యవంశీ శతక గర్జనతో రాయల్స్ కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 212 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది.**

గిల్‌ చెలరేగాడు

ఈ మ్యాచులో ఫస్ట్‌ బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్లు సాయి సుద‌ర్శన్ (39), గిల్ చ‌క్కని ఆరంభాన్ని అందించారు. ప‌వ‌ర్ ప్లేలో 53 ప‌రుగులు జోడించారు. ఫ‌స్ట్ వికెట్ కు 93 ప‌రుగులు జోడించారు. జోస్ బ‌ట్ల‌ర్ (26 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు ఫిఫ్టీతో చెల‌రేగాడు. మ‌రో ఎండ్ లో గిల్ కూడా గేర్ మ‌ర్చాడంతో ప‌రుగులు వేగంగా వ‌చ్చాయి. 29 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్న గిల్.. సెంచరీకి చేరువైన త‌రుణంలో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత మ‌రింత దూకుడుగా ఆడిన బ‌ట్ల‌ర్.. 26 బంతుల్లో ఫిఫ్టీ చేసి సూప‌ర్ ఫినిషింగ్ ఇచ్చాడు**

వైభవ్ వన్‌ మేన్ షో

వైభ‌వ్.. ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రద‌ర్శించాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. దీంతో స్కోరు బోర్డు వేగంగా ప‌రుగెలెత్తింది. ఓపెనర్లు య‌శ‌స్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), వైభ‌వ్ చెల‌రేగ‌డంతో ప‌వ‌ర్ ప్లేలో 87 ప‌రుగులు వ‌చ్చాయి. 17 బంతుల్లోనే ఫిఫ్టీ ని వైభ‌వ్ బాదాడు. ఆ త‌ర్వాత కూడా చెల‌రేగి ఆడుతూ, మ‌రో 18 బంతుల్లో ఐపీఎల్లో తొలి సెంచ‌రీ చేసి, ఈ ఘ‌న‌త సాధించిన అత్యంత పిన్న‌వ‌య‌స్కుడిగా నిలిచాడు.దీంతో రాజస్థాన్ సునాయస విజయం సాధించింది.

Tags:    

Similar News