RCB vs KKR : ఈ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్ కష్టం.. వెంకటేశ్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆర్సీబీపై గెలుపు తర్వాత కేకేఆర్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బౌండరీలు కొట్టడం చాలా కష్టమైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది’ అని చెప్పారు. ఆర్సీబీ ఓటమికి ఇదే కారణమని, ఒకవేళ ఛేజింగ్ అయితే పక్కా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తన రికార్డు నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరుపై నెగ్గింది. సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2016 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాకు ఓటమే ఎదురుకాలేదు. ఈ స్టేడియం కేకేఆర్‌కు సొంత మైదానంలా మారింది.
ఆర్సీబీ ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ చతికిలపడింది. 183 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి 19 బంతులు ఉండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ల ముందు ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. వెంకటేశ్ 50, నరైన్ 47, సాల్ట్ 30, శ్రేయస్ 39* పరుగులు చేశారు. అంతకుముందు కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ 182 రన్స్ చేసింది.