T20 World Cup 2024 : నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్

Update: 2024-06-01 05:23 GMT

T20 వరల్డ్‌కప్ సన్నాహాల్లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య న్యూయార్క్ వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్/వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా జట్టులో చేరారు. అతను వార్మప్ మ్యాచులో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కాగా, నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు ఈ టైటిల్ కోసం పోటిపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మే 28వ తేదీన న్యూయార్క్ చేరుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ను భారత్ ఆడబోతుంది.

Tags:    

Similar News