పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడేందుకు నిరాకరించిన భారత మాజీ క్రికెటర్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. డబ్ల్యూసీఎల్‌లో గ్రూపు దశ మ్యాచ్, సెమీస్ మ్యాచ్‌లను భారత్ చాంపియన్స్ రద్దు చేసుకుంది. పాక్‌తో తలపడాల్సి వస్తే అది ఫైనల్ అయినా ఇదే నిర్ణయం తీసుకుంటామని ఇండియా చాంపియన్స్ వర్గాలు తెలిపాయి. తమకు ఎప్పుడైనా దేశమే ముఖ్యమని పేర్కొన్నాయి. ‘మేము పాకిస్తాన్‌తో ఆడటం లేదు. మా దేశం అన్నింటి కంటే ముఖ్యమైంది. భారత్ కోసం ఏదైనా చేస్తాం. భారత జట్టు సభ్యులుగా గర్వపడుతున్నాం. మా షర్ట్స్‌పై భారత జెండా రావడానికి మేము ఎంతో కష్టపడ్డాం. సాధించాం. ఏదేమైనా దేశాన్ని మనం దేశాన్ని నిరాశపర్చం. భారత్ మాతా కీ జై’ అని భారత మాజీ క్రికెటర్లు తెలిపారు. సెమీస్‌ను భారత ఆటగాళ్లు బహిష్కరించడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.