Sachin Record Break : సచిన్ 30 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డ్ తిరగరాసిన వండర్ గర్ల్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట 30 ఏళ్ల కింద నమోదైన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటర్ షెఫాలీ వర్మ. బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో షెఫాలీ వర్మ భారీ రికార్డు నమోదు చేసింది. లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
ఇది ఆమెకు వందో మ్యాచ్ కావడం విశేషం. షెఫాలీ భారత పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్‌లో కలిపి 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలు. షెఫాలీ వర్మ 20 ఏళ్ల 102 రోజుల వయసులో ఈ మైలురాయిని సాధించింది.
సచిన్ టెండూల్కర్ 20 ఏళ్ల 329 రోజుల వయసులో తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే షెఫాలీ 21 సంవత్సరాల 18 రోజుల వయస్సులో తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వెస్టిండీస్‌కు చెందిన షమైన్ క్యాంప్‌బెల్ రాకార్డును కూడా బ్రేక్ చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో షెఫాలీ బ్యాట్ పెద్దగా రాణించలేదు. ఆమె 14 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేయగలిగింది.