WTC: కంగారులతో భారత్ ఫైనల్ పోరు
వరల్డ్ టెస్ట్ క్రికెట్‌లో ఆధిపత్యం చూపుతున్న రెండు టాప్ టీంల మధ్య అతి పెద్ద యుద్ధానికి రంగం సిద్ధమైంది.ఇవాల్టి నుంచి జరిగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, ఆ్రస్టేలియాలు తలపడనున్నాయి.;
వరల్డ్ టెస్ట్ క్రికెట్‌లో ఆధిపత్యం చూపుతున్న రెండు టాప్ టీంల మధ్య అతి పెద్ద యుద్ధానికి రంగం సిద్ధమైంది.ఇవాల్టి నుంచి జరిగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, ఆ్రస్టేలియాలు తలపడనున్నాయి. గత ఫైనల్ సౌతాంప్టన్‌లో జరగ్గా, ఈసారి ఓవల్‌గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో విజేతగా నిలిచే జట్టుకు తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్ దక్కుతుంది.బలాబలాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ ఇద్దరికి ఇది 50వ టెస్టు.
ఇక రెండేళ్ల క్రితం,టీమిండియా తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. 2019–21 మధ్య 12 టెస్టుల్లో విజయాలు సాధించి అద్భుత ఫామ్‌తో ఫైనల్‌కి అర్హత సాధించింది.అయితే ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఆ్రస్టేలియా టీం న్యూజిలాండ్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువే గెలిచినా... స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఫైనల్ అవకాశాలు చేజార్చుకొని తీవ్ర నిరాశకు గురైంది.ఇప్పుడు రెండు టీంలకు తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు మరో అవకాశం వచ్చింది.తటస్థ వేదికలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అయితే ఓవల్ గ్రౌండ్‌లో పిచ్‌ను చూస్తే భారత్ నలుగురు పేసర్లతో ఆడుతుందా లేక రెండో స్పిన్నర్‌కు ఛాన్స్ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.షమీ, సిరాజ్‌లతో పాటు ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దుల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఉంది.టాప్–4లో రోహిత్, గిల్, పుజారా,కోహ్లి ఉండగా, శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఐదో స్థానంలో రహానే ఆడనున్నాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు చోటు ఖాయంగా కనిపిస్తోంది.
ఓవల్ పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది.ఇది పేసర్లకు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటర్లకు మంచి షాట్‌లు కొట్టే అవకాశం కూడా ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువ ఉండటంతో బ్యాటర్లు రన్స్ భారీగా చేసే అవకాశం కూడా ఉంది. మ్యాచ్‌కు వర్షం ఇబ్బంది కలిగించకపోవచ్చని ఇంగ్లండ్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక వేళ వర్షం పడినా మ్యాచ్‌కి రిజర్వ్ డే కూడా ఉంది.