నిన్న ముంబై ఇండియన్స్ పై సెంచరీతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జైస్వాల్ ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల వయసు లోపు (22 సంవత్సరాలు116 రోజులు) రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇతను గత ఏడాది ముంబై ఇండియన్స్ పైనే తొలి సెంచరీ బాదారు. తక్కువ ఏజ్లో రెండు సెంచరీలు కొట్టిన వారి జాబితాలో గిల్(23 సంవత్సరాల 255రోజులు), శాంసన్ (24 సంవత్సరాల 138రోజులు), వార్నర్ (25 సంవత్సరాల196రోజులు), కోహ్లి(27Y 184రోజులు) ఉన్నారు.
కాగా, ముంబై ఇండియన్స్‌పై రెండు సెంచరీలు చేసిన జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్ ముంబైపై ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. క్రిస్ గేల్ (పంజాబ్ కింగ్స్‌పై), విరాట్ కోహ్లి (గుజరాత్ టైటాన్స్‌పై), డేవిడ్ వార్నర్ (కేకేఆర్‌పై), బట్లర్ (కేకేఆర్‌పై), బట్లర్ (ఆర్సీబీపై)తో కలిసి జైస్వాల్ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.