Young Cricketer Tilak Varma: 'వేళ్లు కదపలేకపోయాను'.. ప్రాణాంతక వ్యాధి గురించి తిలక్ వర్మ

భారత ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ ఇటీవలి సంవత్సరాలలో భారత T20I జట్టులో అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు.

Update: 2025-10-24 07:59 GMT

కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగే వారినే విజయం వరిస్తుంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తి యువ క్రికెటర్ తిలక్ వర్మ. ఆరోగ్యం సహకరించకపోయినా ఆట మీద మక్కువను కోల్పోలేదు. అదే అతడిని ముందుకు నడిపించింది. 

BCCI కార్యదర్శి జై షా మరియు MI యజమాని ఆకాష్ అంబానీ తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు కోలుకునే ప్రక్రియలో తనకు ఎలా సహాయం చేశారో తన ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ప్రాణాంతక వ్యాధి

నవంబర్ 2022లో టెస్ట్ జట్టులోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు తాను ఎదుర్కొన్న ఒక ప్రత్యేక సంఘటన గురించి మాట్లాడుతూ, ఇండియా A బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు తాను ఒక పరిస్థితిని ఎదుర్కొన్నానని, దాని వల్ల తనను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని వెల్లడించాడు.

"రాబ్డోమియోలిసిస్ అనే వ్యాధి తనకు వచ్చిందని, దాని వలన కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయని తెలిపాడు. అయినా నేను ఆడడానికే ప్రయత్నించాను. విశ్రాంతి రోజులలో కూడా, నేను కోలుకోవడం గురించి పట్టించుకోకుండా వ్యాయామం చేసేవాడిని. ఓవర్‌లోడ్ కారణంగా నా నరాలన్నీ బిగుసుకుపోయాయి, అని తిలక్ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్‌లో వెల్లడించాడు.

"నేను బంగ్లాదేశ్‌లో ఎంఐ మరియు ఇండియా ఎతో ఉన్నప్పుడు నాకు విపరీతమైన నొప్పి, బాధ. బ్యాట్ పట్టుకోవడం కూడా కష్టమవుతోంది. నా వేళ్లను కదపలేకపోవడంతో చేతి గ్టౌజెస్ కూడా కత్తిరించాల్సి వచ్చింది. సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారేదని వైద్యులు హెచ్చరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఒక సిక్స్ మరియు రెండు ఫోర్లతో 33 (100) పరుగులు చేశానని తెలిపాడు. జే షా సార్ కి ధన్యవాదాలు చెప్పాలి. BCCI మరియు COE నాకు చాలా సహాయపడ్డాయి" అని వెల్లడించాడు.

2023 సీజన్‌లో తిలక్ ముంబై టీమ్ లోకి తిరిగి వచ్చే ముందు చాలా నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే, సౌత్‌పా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తన అత్యధిక IPL స్కోరు 84*(46) నమోదు చేశాడు. ఆ సంవత్సరం అతను అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు, 164.11 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు చేశాడు.

రాబ్డోమియోలిసిస్ అంటే ఏమిటి?

తిలక్ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, రాబ్డోమియోలిసిస్ అనేది కండరాల కణాలు వేగంగా నాశనమై, మయోగ్లోబిన్ వంటి హానికరమైన పదార్థాలు రక్తప్రవాహంలోకి విడుదలయ్యే శారీరక పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీస్తుంది. వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు.

Tags:    

Similar News