Asteroid : వస్తోంది ఆస్ట్రాయిడ్.. మన భూమివైపే!

Update: 2024-09-11 11:45 GMT

అంతరిక్షంలో మన భూ గ్రహాన్ని మరో ఆస్టరాయిడ్ భయపెడుతోంది. క్రికెట్ స్టేడియం సైజు కన్నా పెద్దదిగా ఉన్న ఈ ఆస్టరాయిడ్ భూమి వపునకు దూసుకొస్తుండటంతో శాస్త్రవేత్తలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పటికే హెచ్చరించింది.

అపోఫిస్ అనే పేరును ఈ ఆస్టరాయిడ్ కు పెట్టారు సైంటిస్టులు. ఇది ఈజిప్టు ప్రజలు పూజించే దైవం. భూమికి 32 వేల కిలో మీటర్ల ఎత్తులో ప్రయాణించవచ్చునని, ఇంత పరిణామంలో ఉన్న మరే గ్రహ శకలం భూమికి సమీపంలో ఇప్పటి వరకు ప్రయాణించలేదు. ఈ అతిపెద్ద గ్రహశకలం 2029 ఏప్రిల్ 13న భూమికి చేరువగా ప్రయాణించే అవకాశాలు ఉందని చెబుతున్నారు.

దీని కదలికలను ఇస్రో క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. ఆస్టరాయిడ్లను గమనించేందుకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఇస్రో ఏర్పాటు చేసింది. 'ప్లానెటరీ డిఫెన్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగం.. భూమి వైపు నకు దూసుకొచ్చే ఖగోళ వస్తువుల నుంచి భూమిని రక్షించడమే విధిగా పని చేస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇటీవల వెల్లడించారు. ఈ గ్రహ శకలం దాదాపు 340 నుంచి 450 మీటర్ల వ్యాసంతో ఉందన్నారు. గుజరాత్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియకం కన్నా ఈ గ్రహశకలం పెద్ద సైజ్ లో ఉందన్నారు. ఈ ఆస్టరాయిడ్ కదలికలను మొదట 2004లో గుర్తించారు. భూమికి అతి సమీపంగా ప్రయాణించే అవకాశాలు ఉండటంతో ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై అప్పటినుంచే ఓ కన్నేసి ఉంచారు.

Tags:    

Similar News