PSLV-C59 Rocket : పీఎస్ఎల్వీ సీ- 59 రాకెట్ ప్రయోగంకు సర్వం సిద్ధం

Update: 2024-12-03 12:30 GMT

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 4న పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ ను ప్రయోగిస్తున్నారు. ఈ మిషన్ లో రెండు ఉపగ్రహాలను అమర్చారు. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ (సిఎస్సి ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో ఏర్పాటు చేశారు. ఈ భూమి నుంచి సుమారు 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రయోగ విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కౌంట్ డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ప్రారంభమై 25.30 నిమిషాలు కౌంట్ కొనసాగిన అనంతరం 4వ తేదీ సాయంత్రం 4.08 నిమిషాలకు రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు.

Tags:    

Similar News