నిజామాబాద్ జిల్లా వర్నిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కా ర్యక్రమంలో పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్.. తెలుగువారి కోసమే తె లుగుదేశం పార్టీ ఏర్పడిందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ హయాం లోనే అనేక మార్పులు జరిగాయని గుర్తుచేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కాసాని డిమాం డ్ చేశారు. బీఆర్‌ఎస్ సర్కార్‌తో జనం విసిగిపోయారని.. అకాల వర్షాలతో నష్టపోయి న రైతులన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాసాని జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు.