సీఎం.. సీఎం.. అనొద్దు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Update: 2023-05-23 12:26 GMT

తన 60వ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం.. సీఎం.. అనొద్దని కార్యకర్తలకు సూచించారు. సీఎం అంటే అందరూ కలిసి ఓడిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఏ పదవీ ముఖ్యం కాదన్నారు ఆయన. ప్రజల కోసం చావడానికైనా సిద్ధమన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. తనను ఐదు సార్లు గెలిపించిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. వారం లేదా పదిరోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందని తెలియజేశారు.

Similar News