విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలంటూ లేఖలో పేర్కొన్నారు. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో.. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజేప్పే కుట్ర జరుగుతోందని ఆయన.... కార్పొరేట్ మిత్రుల కోసం 12.5 లక్షల కోట్లను ప్రధాని మోదీ మాఫీ చేశారని చెప్పారు. ఇదే ఔదార్యం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఎందుకు లేదని ప్రస్తావించారు. కేంద్రమే వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థిక సాయం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో.. విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనాన్ని పరిశీలించాలని సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెంటనే 5 వేల కోట్లు కేటాయించాలంటూ లేఖలో కోరారు మంత్రి కేటీఆర్