బీజేపీ నేతలతో తరుణ్ చుగ్ భేటీ
బీఆర్ఎస్‌పై మరింత ఉధృతంగా రాజకీయ పోరాటానికి బీజేపీ పదును;
బీఆర్ఎస్‌పై మరింత ఉధృతంగా రాజకీయ పోరాటానికి బీజేపీ పదును పెడుతోంది. ఈ మేరకు కార్యాచరణను రెడీ చేస్తోంది. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో వినూత్న కార్యక్రమానికి సిద్ధం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. బండి అరెస్టు నేపథ్యంలో బీజేపీ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రతిజ్ఞ పత్రాన్ని సిద్ధం చేస్తున్న బీజేపీ నాయకులు.. బీఆర్ఎస్‌పై పోరాటం చేస్తామంటూ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేసేలా రేపు కార్యక్రమాలు చేయనుంది. కేసుకు, జైలుకు భయపడకుండా కార్యకర్తలు పనిచేసేలా వ్యూహం రచించడంతో పాటు కార్యకర్తలల్లో మనోధైర్యం నింపే విధంగా కార్యక్రమాలు చేయాలని తరుణ్ చుగ్ రాష్ట్ర నేతలకు ఆదేశించారు.