Medaram Jathara: రేపటినుంచి నాలుగు రోజులపాటూ మేడారం జాతర

సర్వాంగ సుందరంగా ముస్తాబైన మేడారం

Update: 2024-02-20 04:45 GMT

మహాజాతరకు మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైన మేడారంముస్తాబైంది. రేపట్నుంచి నాలుగురోజుల పాటు జాతర అంగరంగ వైభవంగాజరగనుంది. గద్దెలపై కొలువుతీరేందుకు పగిడిద్దరాజు డప్పుడోలు వాయిద్యాల నడుమ కోలాహలంగా మేడారం బయలుదేరనున్నాడు. జాతర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. భక్తుల కోసం యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది.

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబింగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఏటా రెండేళ్లోకోసారి ఈ జాతర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గ వనం వీడి జనం మధ్యకు వచ్చే వనదేవతల ఆగమనంతో..అసలైన మహా జాతర మొదలవుతోంది. ఇసకేస్తే రాలనంత జనంజేజేల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల ఆగమనం మొదలుకానుంది. బుధవారం నుంచి మొదలయ్యే జాతర కోసం ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడద్దరాజు డప్పు డోలు వాయిద్యాల నడుమ..శివసత్తుల నృత్యాల మధ్య నేడుకోలాహలంగా మేడారానికి బయులుదేరతాడు. గుడి నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు గ్రామవీధుల్లో సందడిగా సాగుతుంది. అటవీమార్గంలో  70కీలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరి రేపు సాయంత్రానికి మేడారానికి విచ్చేస్తారు. ఆ సమయంలో..కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరతారు.

జాతర రెండోరోజు గురువారం సమ్మక్క ఆగమనమే. లక్షలాది భక్తులకోలాహలం నడుమ సమ్మక్క సగౌరవంగా గద్దెలపైకి వస్తుంది. జాతర మూడోరోజు దేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శనివారం రాత్రి దేవతలు తిరిగి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు ముందే 50 లక్షలపైన భక్తులు దేవతలను దర్శించుకున్నారు. దూరప్రాంతాలనుంచి వ్యయప్రయాసలు లెక్కచేయక తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరినకోర్కెలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాలుగు రోజుల్లో కోటిన్నర నుంచి రెండుకోట్లపైన భక్తులు దర్శించుకోనున్నారు. 110 కోట్ల వ్యయంతో సర్కార్ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. 

ములుగు గట్టమ్మ తల్లి ఆలయం గేట్‌వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి కెక్కింది. మేడారం మహా జాతర వేళ గట్టమ్మతల్లి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లినితనివీతీరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని భక్తులు మేడారం పయనమౌతున్నారు. కోరినవారికి కొంగు బంగారంగా నిలిచి వరాలిచ్చే శక్తిగా గట్టమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను ముందే..దర్శించుకున్నంత తృప్తిని భక్తులు పొందుతారు.  ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని.. ప్రపంచ పర్యావరణ సంస్థ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి కోరారు. సేవ్ మేడారం- క్లీన్ మేడారం- మేడారం సే నోటు ప్లాస్టిక్ గోడపత్రిక, పర్యావరణ హిత సంచులను హైదరాబాద్‌ హైదర్ గూడలో విడుదల చేశారు. 

Tags:    

Similar News