Yadadri: యాదాద్రిలో వంద కిలోల గంజాయి పట్టివేత..
Yadadri: యాదాద్రి జిల్లా రెడ్డిబావి వద్ద తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.;
Yadadri: గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యాదాద్రి జిల్లా రెడ్డిబావి వద్ద తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా లంబసింగి నుంచి కారులతో తరలిస్తున్న వందకిలోల గంజాయి, పదిలీటర్ల లిక్విడ్ గంజాయిని పోలీసులు వలపన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు తరుచుగా హైదరాబాద్‌తోపాటు కర్నూలు, కేరళకు మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.